Tuesday, May 7, 2024

ప్లే స్టోర్ నుంచి 2200 యాప్స్ ను తొలగింపు!!

spot_img

మీ ఫోన్ ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తాజాగా 2200కుపైగా యాప్స్ ను డిలీట్ చేసింది. వీటిని మీరు ఉపయోగిస్తుంటే వెంనే ఆన్ ఇన్ స్టాల్ చేయండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్థికంగా మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఈ యాప్స్ పై గూగుల్ కఠిన చర్యలు తీసుకుంది. గూగుల్ మరోసారి ప్లే స్టోర్ నుంచి పలు యాప్‌లను తొలగించింది.

ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడానికి,గూగుల్ ఎప్పటికప్పుడు ప్లేస్టోరో నుండి నకిలీ యాప్‌లను తొలగిస్తుంది. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న నకిలీ లోన్ యాప్‌లపై గూగుల్ మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 2022, ఆగస్టు 2023 మధ్య గూగుల్ ప్లే స్టోర్ నుండి 2200 కంటే ఎక్కువ నకిలీ లోన్ యాప్‌లను గూగుల్ తొలగించిందని ఒక నివేదిక వెల్లడించింది.

పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ ఫేక్ లోన్ యాప్‌లను అరికట్టడానికి ఆర్‌బిఐతో ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియజేశారు. ఇంతకుముందు, గూగుల్ ఏప్రిల్ 2021, జూలై 2022 మధ్య 3500 నుండి 4000 యాప్‌లను సమీక్షించి వాటిపై చర్యలు తీసుకుంది. ఫేక్ లోన్ యాప్స్ పై చర్యలు తీసుకోవడంతోపాటు కంపెనీ తన పాలసీలో కూడా పెద్ద మార్పులు చేసింది. ఇప్పుడు ఆ యాప్‌లు మాత్రమే నియంత్రిత ఎంటిటీలు లేదా ఈ ఎంటిటీల సహకారంతో గూగుల్ ప్లేస్టోర్ లో ప్రవేశాన్ని పొందుతాయి. ఇది మాత్రమే కాదు, గూగుల్ ఇప్పుడు అదనపు పాలసీ అవసరాల ను కూడా అమలు చేసింది.

ఇలాంటి ఫేక్ యాప్స్ ఉంటే డిలీట్ చేయండి:
– మీ జాగ్రత్త మాత్రమే మిమ్మల్ని ఇంటర్నెట్ ప్రపంచంలో సురక్షితంగా ఉంచుతుంది. అజాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో వేల సంఖ్యలో యాప్‌లు ఉన్నాయి. నిజమైన, నకిలీ యాప్‌ల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే,వీటిని గుర్తించవచ్చు.

– ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు, దాని రివ్యూను ఖచ్చితంగా చెక్ చేయండి.

-ఆ యాప్ ఎప్పుడు ప్రారంభించిందో తెలుసుకోండి. కొత్త యాప్ డౌన్‌లోడ్ సంఖ్య ఎక్కువగా ఉంటే అది నకిలీ కావచ్చు.

– ఇన్‌స్టాలేషన్ సమయంలో యాప్ ఎలాంటి వివరాలను అడుగుతుందో కూడా గమనించండి.

-మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకున్నప్పుడు, దాన్ని గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇది కూడా చదవండి: ఉదయం లేవగానే చాయ్ తాగుతున్నారా?అయితే భారీ నష్టం తప్పదు..!!

Latest News

More Articles