Sunday, May 19, 2024

160 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్

spot_img

జైపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానం (6ఈ-784) ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఆ ఫ్లైట్ లో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. 17వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న సమయంలో విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. దాదాపు 35 నిమిషాల తర్వాత ఫైలట్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ ను సంప్రదించి జైపూర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ విమానం (6E-784) సోమవారం సాయంత్రం 6:15 గంటలకు జైపూర్ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు బయలుదేరింది.

ఇది కూడా చదవండి: జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఇదేనట..!

విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యిందన్న వార్త తెలియగానే విమానంలోని ప్రయాణికుల భయంతో వణికిపోయారు. అయితే పైలట్ తన తెలివితేటలు చూపించి ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్‌ను సంప్రదించి విమానాన్ని సురక్షితంగా జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. ఇంతకు ముందు కూడా ఇండిగో విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. సాంకేతిక లోపం కారణంగా, బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం తిరిగి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీపీఐఏ) నుంచి బయలుదేరిన 40 నిమిషాల తర్వాత విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ బయల్దేరిన ఇండిగో విమానం గాలిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉదయం 8.20 గంటలకు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

Latest News

More Articles