Sunday, June 23, 2024

‘మేం జవాన్లం.. మా ప్రాణాలు వెయ్యిసార్లు అయిన పోగొట్టుకుంటాం’ అదరగొడుతున్న షారుక్ ‘జవాన్’ ట్రైలర్

spot_img

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన సినిమా ‘జవాన్’. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ రానే వచ్చింది. సినిమా ప్రమోషన్స్‎లో ఫుల్ బిజీగా ఉన్న మూవీ టీమ్.. తాజాగా 2:45 నిమిషాల నిడివి గల ట్రైలర్ వీడియోను రిలీజ్ చేసింది. అదిరిపోయే డైలాగ్లు, యాక్షన్ సన్నివేశాలతో, కళ్లు చెదిరే విజువల్స్‎తో అభిమానులను కట్టిపడేస్తోంది. దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల పవర్ ఫుల్ యాక్షన్‎తో ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.

ఈ సినిమాలో విలన్‎గా విజయ్ సేతుపతి నటించారు. ఆయుధాల స్మగ్లర్‎గా విజయ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణె, ప్రియమణి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‎తో రూపొందిస్తున్నారు. షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అనిరుధ్ సంగీతమందించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Latest News

More Articles