Sunday, May 19, 2024

జేఈఈ మెయిన్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

spot_img

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో వచ్చే ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. జనవరిలో తొలి విడత పరీక్షలు, ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. సెషన్‌ 1 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ప్రారంభించింది. నవంబర్‌ 30న రాత్రి 9గంటల వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తేదీల్లో జరుగుతాయి.

జేఈఈ మెయిన్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌‌ కార్డులను పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెషన్‌ -1 ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్టు NTA నోటిఫికేషన్‌లో తెలిపింది. JEE Main Session 2కు ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వ తేదీ రాత్రి 9గంటల వరకు స్వీకరిస్తారు. పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య జరుగుతాయి. ఫలితాలను ఏప్రిల్‌ 25న విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్‌ పరీక్షను 13 భాషల్లో (ఇంగీష్ , హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్‌, ఉర్దూ) నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‎లో ఎవడికి వాడు నేనే సీఎం అంటున్నడు.. అందరూ చిల్లరగాళ్లే

Latest News

More Articles