Sunday, May 19, 2024

కాంగ్రెస్‎లో ఎవడికి వాడు నేనే సీఎం అంటున్నడు.. అందరూ చిల్లరగాళ్లే

spot_img

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్‎లోని విఎన్ఆర్ గార్డెన్‎లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నియోజక వర్గ ఇంచార్జీ రావుల శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘మీ ఉత్సాహం, మీ ఊపు చూస్తుంటే లక్ష్మారెడ్డి గెలుపు పక్కా అయిపోయింది. బూత్ కార్యకర్తలు బాగా పనిచేసి లక్ష్మా రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ ఏమైపోతుందో అని అనుమానం ఉండే. కానీ, ఇవాళ తెలంగాణ దేశానికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి నేను హైదరాబాద్‎లో ఉన్నానా లేక న్యూయార్క్‎లో ఉన్ననా అని అన్నాడు. బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కూడా నాకు హైదరాబాద్‎లోనే ఉండాలని ఉంది అని ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో చెప్పాడు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతుంది అని ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి. 10 యేండ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో చిమ్మ చీకట్లు ఉండేవి. ఇదే చర్లపల్లి పరిశ్రమల ప్రతినిధులు గతంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసేవారు. మంచి నీళ్లు లేక ఆనాడు మన హైదరాబాద్ అవ్వలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆనాడు మెట్రో పనులు చేస్కోలేని పరిస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే సాధ్యం అయింది. మళ్ళీ అధికారంలోకి వస్తే 24 గంటల మంచి నీళ్ళు ఇచ్చుకోవాలి. ఆంధ్రా-తెలంగాణ పంచాయతీ లేదు, కర్ఫ్యూ లేదు. ఆనాడు పరిస్థితి ఎలా ఉండే.. ఈనాడు పరిస్థితి ఎలా ఉంది? ముస్లిం, హిందు గొడవలు లేవు. ఉప్పల్‎కు మినీ ఇండియాగా పేరు ఉంది, ఎన్నో రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎన్నో జాతీయ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. మొన్న గణేష్ నిమజ్జనం వచ్చింది, అదే రోజు ముస్లింల పండుగ వచ్చింది. కానీ, ముస్లిం మత పెద్దలు వాళ్ళ పండుగను వాయిదా వేసుకొని నిమజ్జనంలో పాల్గొన్న వారికి మంచి నీళ్ళు ఇచ్చారు.. ఇది కదా తెలంగాణ రాష్ట్రం. మొన్న పార్లమెంటులో ఒక ముస్లిం ఎంపీని పట్టుకొని నీవు ఉగ్రవాదివి అని బీజేపీ వాళ్ళు అన్నారు.

Read Also: తెలంగాణ ఎన్నికలకు పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల అధికారులు

ఔషధాలకు అడ్డాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. కరోనాకు మందు కుడా మన దగ్గరే తయారు చేశారు. నగరం బాగుంటే మనం బాగుంటాం. నేను కూడా హైదరాబాద్‎లోనే పెరిగాను. నీళ్లు లేక, కరెంట్ లేక ఎన్ని బాధలు పడ్డమో నాకు కూడా తెలుసు. ఉప్పల్ ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లయింది. స్కై వాక్ అయితే మనం కట్టుకున్నాం. ఉప్పల్ ప్లై ఓవర్ వాళ్ళు కడుతాం అన్నారు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఉప్పల్ ప్లై ఓవర్, స్కై వేను చూస్తే మోడీ పనితీరు, కేసీఆర్ పనితీరుకు తేడా ఏంటో తెలుస్తుంది. మేం కడుతాం అంటే.. లేదు లేదు మేమే కడుతాం అన్నారు.. ఏమైంది ఇంకా పూర్తి చేయలేదు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు.. ఆయన ఇక్కడకు రాడు, ఇక్కడ బాధలు పట్టించుకోడు. వరదలు వస్తే రాడు… ఎల్బీ నగర్లో నీళ్లు వస్తే రాడు. ఏదో 5 వేల ఓట్లతో గెలిచిన ఆయన కూడా పెద్డ పెద్డ మాటలు మాట్లాడుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అని మాట్లాడుతున్నాడు. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు. ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఇష్టం లేని లగ్గం చేసి ఆంధ్రాలో కలిపారు. ఇలా కలిపింది ఆయన ముత్తాత జవహర్ లాల్ నెహ్రు. ఆనాడు ఎంతో మంది ప్రాణాలు తీసింది ఈయన తాత కాదా? 1956లో తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేసింది రాహుల్ గాంధీ ముత్తాత కాదా? మళ్ళీ మర్లపడితే రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ మన పిల్లలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తాం అని చెప్పింది. 2009లో వందల మందిని బలి తీసుకున్నది ఈ సోనియా గాంధీ, ఢిల్లీ దొరలు కాదా? ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చింది ఇదే కేసీఆర్ కాదా? ఢిల్లీ నుండి ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మితే ఆగం అవుతాం. చిల్లర గాళ్ళు కావాలా… అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కావాలా? కేసీఆర్ స్థాయి ఎంత… చిల్లర గాడు రేవంత్ రెడ్డి స్థాయి ఎంత? పైసలు పంచం అని ప్రమాణం చేద్దాం అని సవాలు చేస్తున్నాడు. రూ. 50 కోట్లతో దొరికిన దొంగ.. అమరవీరుల దగ్గర ప్రమాణం చేద్దాం అన్నాడు. వీడా అమరవీరుల స్తూపం దగ్గర సవాలు అంటున్నాడు. సోనియా గాంధీని బలి దేవత అన్నది ఈ రేవంత్. రాహుల్ గాంధీని ముద్ద పప్పు అన్నది ఈ రేవంత్… వీడియోలు చూస్తే తెలుస్తోంది.

Read Also: చంద్రబాబుపై హైదరాబాద్‎లో కేసు నమోదు

కాంగ్రెస్‎లో ఇప్పుడే మంత్రి పదవులు అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా గెలిచిపోయాం అన్నారు ఏమైంది. జానా రెడ్డి కూడా నేనే సీఎం అంటున్నారు. ఆనాడు ఉద్యమంలో రాని వారు ఇవాళ మేమే సీఎం అని వస్తున్నారు. పాత సీసాలో కొత్త సారా తప్ప కాంగ్రెస్ లో ఏం లేదు. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. 5 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్నాయి… ప్రతి ఓటర్‎ను కలవాలి. మనం ఏం చేశామో పక్కాగా చెప్పాలి… ఏం చేస్తామో కూడా చెప్పాలి. ఓటర్లకు ఎప్పటికప్పుడు మన పథకాలు చెప్పాలి. రోడ్లు బాగు చేశాం, శిల్పారామం కట్టుకున్నాం, వైకుంఠ ధామం కట్టుకున్నాం అని చెప్పాలి. మ్యానిఫెస్టోను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ భీమా ఇంటింటికి ధీమా అని ప్రతి ఒక్కరికి తెలపాలి. కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యాక రూ. 400లకే సిలిండర్‎ను అందజేస్తాం అని చెప్పాలి. సౌభాగ్య లక్ష్మి గురించి కూడా ఇంటింటికి తిరిగి మహిళలకు చెప్పాలి. అసైన్డ్ ల్యాండ్ పై పూర్తి హక్కులు భూ యజమానులకు వస్తాయి అని చెప్పాలి. సీఎం కేసీఆర్ భరోసా కర పత్రాన్ని ప్రతి ఇంటింటికి అందజేయాలి. మరో లక్ష డబుల్ బెడ్ రూమ్‎లు నిర్మించి ఇస్తాం అని చెప్పాలి. కంటికి రెప్పలగా మిమ్ములను కాపాడుకుంది మీ కేసీఆర్. ఎంతో అభివృద్ధి చేసుకున్నాం.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles