Sunday, May 19, 2024

ఇంకా 2వేల నోట్లు ఉన్నాయా? వాటిని ఇలా డిపాజిట్ చేయండి

spot_img

ఇంకా ఎవరి దగ్గరైనా రూ.2000 వేల నోట్లు ఉండి ఉంటే ..వాటిని మార్చుకునేందుకు ఆర్బీఐ రెండు ప‌ద్ధ‌తుల్లో అవ‌కాశం క‌ల్పించింది. పోస్టు ద్వారా ఆ నోట్ల‌ను ఆర్బీఐకి పంపుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. ఇన్‌సూర్డ్ పోస్టు ద్వారా ఆ అమౌంట్‌ను పంపుకోవ‌చ్చు. బ్యాంక్ అకౌంట్లోకి ఆ 2వేల నోట్ల అమౌంట్ క్రెడిట్ అవుతుంద‌ని ఆర్బీఐ అధికారులు చెప్పారు. ప్రాంతీయ ఆఫీసుల‌కు దూరంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు ఆర్బీఐ తెలిపింది. ఇన్‌స్యూర్డ్ పోస్టుతో పాటు టీఎల్ఆర్ ప‌ద్ధ‌తిలోనూ రెండు వేల నోట్ల‌ను ఎక్స్‌చేంజ్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. టీఎల్ఆర్ అంటే ట్రిపుల్ లాక్ రిసెప్ట‌క‌ల్‌. టీఎల్ఆర్ ద‌ర‌ఖాస్తును నింపి ఆర్బీఐకి పంపిస్తే, అప్పుడు ఆ క‌స్ట‌మ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ డిపాజిట్ అవుతుంది.

2వేల నోట్ల‌ను ఇన్‌సూర్డ్ పోస్టు ద్వారా పంపిస్తే చాలా భ‌ద్రంగా ఆ అమౌంట్ చేరుకుంటుంద‌ని, ఆ క‌స్ట‌మ‌ర్లు బ్యాంకు కోసం ప్ర‌యాణాలు చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌ద‌ని ఆర్బీఐ రీజిన‌ల్ డైరెక్ట‌ర్ రోహిత్ పీ దాస్ తెలిపారు. టీఎల్ఆర్‌, ఇన్‌సూర్డ్ పోస్టు విధానాలు చాలా భ‌ద్ర‌మైన‌వ‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఆర్బీఐ ఆఫీసుకు ఇప్ప‌టి వ‌ర‌కు 700 టీఎల్ఆర్ ఫార్మ్స్ వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పుట్టిందే ప్ర‌జ‌ల కోసం.. ఆలోచించి ఓటేయాలి

Latest News

More Articles