Monday, May 13, 2024

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి భారీ వేతనంతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

spot_img

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్‌. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.హైదరాబాద్‌తో పాటు పలు జోనల్‌ కార్యాలయాలు, ప్రాజెక్టు సైట్‌లలో పనిచేసేందుకు మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. భారీ వేతనాలతో కూడిన ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 13 మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగనుంది.

..మొత్తంగా 30 పోస్టులు భర్తీ చేస్తుండగా.. విభాగాల వారీగా ఈసీఈలో 5, ఈఈఈ 7, మెకానికల్‌ 13, సీఎస్‌ఈ 5 చొప్పున ఉన్నాయి.

విద్యార్హతలు: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వేతన స్కేల్‌ : ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు వేతనం అందుతుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చొప్పున చెల్లించాలి.

వయో పరిమితి: 2024 ఏప్రిల్‌ 13 నాటికి అభ్యర్థుల వయస్సు 27ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాలకు వయో సడలింపు ఉంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ రూపంలో రాత పరీక్ష ఉంటుంది.

తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. హాల్‌టిక్కెట్లు, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను ఆ తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

ఎగ్జామ్ సెంటర్లు :హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి/నాగ్‌పుర్‌, దిల్లీ/నోయిడా, కోల్‌కతా

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు కంపెనీలో పనిచేస్తామని బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘిస్తే రూ.4లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: దానం ఓట‌మి ఖాయం.. సికింద్రాబాద్‌లో మ‌న‌కు పోటీ బీజేపీతోనే

 

Latest News

More Articles