Sunday, May 19, 2024

ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ పెడుతున్న‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది

spot_img

ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ పెడుతున్న‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింద‌ని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరం. నాలుగు రోజులే స‌భ నిర్వ‌హిస్తామ‌న్నారని తెలిపారు. బీఏసీ స‌మావేశం ముగిసిన  తర్వాత ఎమ్మెల్యే క‌డియం  మీడియాతో మాట్లాడారు. క‌నీసం 12 రోజులైనా స‌భ నిర్వ‌హించాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. 10న బడ్జెట్,11 సెలవు,12 న చర్చ గా నిర్ణయించారు.అవ‌స‌ర‌మైతే 13న మ‌రోసారి బీఏసీ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌గా బ‌డ్జెట్ ఆమోదించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్రస్తావించే అవ‌కాశం లేకుండా పోతుంద‌న్నారు. అంతకాదు.. క్వశ్చన్ ఓవర్ మీదా గాని , జీరో అవర్ మీదా గాని స్పష్టత ఇవ్వలేదన్నారు.

ముఖ్యమంత్రి స్టేట్ మెంట్ వల్ల, కాంగ్రెస్ పార్టీ నుండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని..ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు కడియం. ఇటువంటివి జరగడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందన్నారు. నాలుగు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగిస్తున్నారన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..మేము మాత్రం ప్రజల తరుపున ఉండి కొట్లాట చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ నోట చెప్పించారు

Latest News

More Articles