Saturday, May 18, 2024

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం వాయిదా.. మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

spot_img

హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్ర ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావలసిన మంత్రి కేటీఆర్.. వర్షాల కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారని, అందుకే వాయిదా వేశామని వినయ భాస్కర్ తెలిపారు. హన్మకొండ కుడా కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కాళోజీ ఫౌండేషన్, కాళోజీ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.

Read Also: పరాయి పాలన ఒక శాపం.. స్వపరిపాలన ఒక వరం..

ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ భాస్కర్ మాట్లాడుతూ.. ‘కాళోజీ బతికినంత కాలం సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం.. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాళోజీ అనేక సార్లు చెప్పారు. కాళోజీ గొప్పతనాన్ని సీఎం కేసీఆర్ అనేక సార్లు ఉద్యమ సమయంలో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాళోజీని సముచితంగా గౌరవించేలని, అదేవిధంగా రేపటి తరాలకు ఆయన గొప్పతనాన్ని తెలపాలనే ఉద్దేశంతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. కవులు, కళాకారులను తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా గౌరవిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కాళోజీని నిర్లక్ష్యం చేశారు. ఆయన స్మారకార్థం ఒక భవనం కట్టేందుకు 300 గజాల స్థలం అడిగితే ఇవ్వలేదు. వెంటనే ఉద్యమ నేత సీఎం కేసీఆర్.. తెలంగాణ వస్తుంది.. 300 గజాలు కాదు.. కాళోజీ కళాక్షేత్రాన్ని 3 ఎకరాల్లో నిర్మించి ఆయన గొప్పతనం దేశ ప్రజలకు తెలియజేద్దామని చెప్పారు. కాళోజీ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టడంతో పాటు.. ఆయన పేరిట అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాళోజీ జయంతి కార్యక్రమాన్ని హనుమకొండలో వైభవంగా నిర్వహిస్తాం. కాళోజీ గొప్పతనాన్ని చాటేలా ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని వినయ భాస్కర్ తెలిపారు.

Latest News

More Articles