Saturday, May 18, 2024

ఔర్ ఎక్ దక్కా.. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా

spot_img

నాకు వ్యక్తిగత ఎజెండా లేదు.. ప్రజల అభివృద్దే ఎజెండా అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్‎లో ప్రెస్ మీట్ నిర్వహించిన కడియం.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‎కు కృతజ్ఞతలు తెలిపారు.

‘స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం. నా విజయంలో ఎమ్మెల్యే రాజయ్య, శాసనమండలి సభ్యుడు పల్లా, మంత్రుల సహకారం తీసుకుంటాను. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి.. కానీ అవన్నీ కూడా త్వరలో సద్దుమణుగుతాయి. 2014, 2018 ఎన్నికల్లో రెండు పర్యాయాలు రాజయ్యకు పార్టీ అవకాశం ఇచ్చింది. రాజయ్య విజయానికి మేమంతా కృషి చేశాం. ఇప్పుడు నా విజయానికి కూడా సోదరుడు రాజయ్య సహకరం అందిస్తాడని నమ్ముతున్నాను. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చేస్తా. నాకు వ్యక్తిగత ఎజెండా లేదు.. ప్రజల అభివృద్దే నా ఎజెండా.

Read Also: కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం వాయిదా.. మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా నిధులు తీసుకువచ్చాను. రూ. 19 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లకు మంజూరు చేయించాను. నియోజకవర్గంలో రూ. 34.67 కోట్ల కనెక్టివిటీ రోడ్లకు మంజూరు అయింది. సీఎం కేసీఆర్ గిరిజనులకు పెద్దపీట వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 65 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరు చేయించాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో పూర్తిగా పడిపోయిన బీజేపీ సింగిల్ డిజిట్‎కే పరిమితం అయ్యింది. ఇక కాంగ్రెస్‎లో బుజ్జగింపులకే సమయం సరిపోతలేదు. కాబట్టి ఔర్ ఎక్ దక్కా.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పక్కా’ అని కడియం అన్నారు.

Latest News

More Articles