Friday, May 17, 2024

గులాబీ జెండా.. నిరుపేదలకు అండ

spot_img

ఖమ్మం జిల్లా:  గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసీఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. తిరుమలాయపాలేం మండలం జూపేడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Also Read.. కేసీ కెనాల్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.

Also Read.. కుత్బుల్లాపూర్‌కు మెట్రో తీసుకొస్తాం

తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కావున ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షులు జనక వెంకటేశ్వర్లు, మాట్టే యలేందర్, నిమ్మల నర్సింహారెడ్డిలు  బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

Latest News

More Articles