Monday, May 20, 2024

వైద్యశాస్త్రంలో కేటలిన్ కరికో, డ్రూ వీస్ మన్ లకు నోబెల్‌

spot_img

ఈ ఏడాది నోబెల్ పురస్కారాలకు తెరలేచింది. వివిధ రంగాల్లో అపూర్వమైన కృషి చేసిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు అందిస్తారు. ఈ ఏడాది వైద్య రంగంలో కేటలిన్ కరికో, డ్రూ వీస్ మన్ లకు నోబెల్ అవార్డు ప్రకటించారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులపై వీరు చేపట్టిన పరిశోధనలకు గానూ వీరికి అవార్డుకు ఎంపిక చేశారు.

Also Read.. భారత దేశంలో ఐటీ మంత్రి అంటే వినపడే పేరే కేటీఆర్..!

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో రూపొందించే వ్యాక్సిన్ల తయారీకి వీరి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేటలిన్ కరికో హంగేరియన్-అమెరికన్ బయోకెమిస్ట్. ఆమె ఆర్ఎన్ఏ ఆధారిత జీవ వ్యవస్థలపై స్పెషలైజేషన్ చేశారు. డ్రూ వీస్ మన్ అమెరికా వైద్యుడు, శాస్త్రవేత్త. ఆర్ఎన్ఏ బయాలజీ పరిశోధక రంగంలో విశిష్ట సేవలందించారు.

Latest News

More Articles