Friday, May 10, 2024

ఐఫోన్ 14పై ఏకంగా 20వేల డిస్కౌంట్…దిమ్మతిరిగే ఫీచర్లు..!!

spot_img

ఈనెల 8న దసరా, దీపావళి పండగ ఆఫర్లు షురూ కానున్నాయి. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్ట్ నిర్వహించే ఈ సేల్ లో ఐఫోన్ కొత్త మోడల్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

పండగల సీజన్ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు స్పెషల్ సేల్స్ ను నిర్వహిస్తున్నాయి. ఆన్ లైన్ షాపించే చేసేవారికి కళ్లు చెదిరే ఆఫర్లు అందించేందుకు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ రెడీ అయ్యాయి. ఈ సేల్ లో భాగంగా ఈ రెండు పోర్టళ్లలో అక్టోబర్ 8వ తేదీ నుంచి దసరా, దీపావళి పండగ ఆఫర్లు షురూ కానున్నాయి. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్ట్ నిర్వహించే సేల్ ఈవెంట్ లో కొన్ని స్మార్ట్ ఫోన్లు కూడా అతితక్కువ ధరకు అందుబాటులో ఉండనున్నాయి. కంపెనీ ఇప్పటివరకు రివీల్ చేసిన డీల్స్ ను చూసినట్లయితే..శామ్ సంగ్, వన్ ప్లస్, రియల్మీ, మోటోరోలాలతో పాటు ఐఫోన్ 14, ఐఫోన్ 14ప్లస్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 50వేల లోపే ఉండటం గమనార్హం.

ఇక దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. ఈసారి బిగ్ బిలియన్ డేస్ లో అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఐఫోన్ అతి తక్కువ ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ఫీచర్లు గురించి తెలుసుకుంటే 6.1అంగుళాల సూపర్ రెటినా, ఎక్స్ డీఆర్ డిస్ప్లే ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ లో 6.7అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డిఆర్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా హైబ్రైట్ నెస్ సపోర్ట్ చేస్తాయి. ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే…ఈ రెండు మోడల్స్ ఫోన్లు 12మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అదేవిధంగా బ్యాక్ సైడ్ 12మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది యాక్షన్ మోడ్ తో కూడిన షాట్స్ తీసుకుంటే బాగా సపోర్ట్ చేస్తుంది.

ఈ మోడల్స్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీలో అందుబాటులో ఉన్నాయి. మిడ్ నైట్, స్టార్ లైట్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ, పర్పుల్, ఎల్లో కలర్స్ లో ఈ రెండు ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Latest News

More Articles