Sunday, May 19, 2024

లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్

spot_img

రాబోయే కాలం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ( సోమవారం) ఆయన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే, అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్‌కు వినోద్‌కుమార్‌, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ అభ్యర్థిగా మాలోత్‌ కవిత పేర్లను కేసీఆర్‌ ప్రకటించారు. అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

నేతలంతా కలిసికట్టుగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు కేసీఆర్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని.. కాంగ్రెస్‌ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే కాలం మనదేనని శ్రేణులకు తెలిపారు. ఈ నెల 12న కరీంనగర్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపిన కేసీఆర్‌.. ఆ తర్వాత ఖమ్మంలోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం

Latest News

More Articles