Friday, May 17, 2024

ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్ ప్రారంభం

spot_img

హైదరాబాద్‌ : ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ క్రికెట్‌ కప్ టోర్నమెంట్ ప్రారంభమైంది. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో టోర్నమెంట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 28 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల పాటు ఈ టోర్నమెంట్‌ కొనసాగనుంది.

BigBoss 7 : బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్.. కంటెస్టెంట్స్ వీళ్లే

సెప్టెంబర్‌ 16, 17వ తేదీల్లో గ్రాండ్‌ ఫైనల్‌ ఉంటుందని బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై విక్టోరియా స్టేట్‌ కన్వీనర్‌ సాయిరాం ఉప్పు చేసిన పవర్‌ ప్రజెంటేషన్‌ పలువురిని ఆకట్టుకుంది.

Latest News

More Articles