Saturday, May 18, 2024

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

spot_img

సికింద్రాబాద్‌ పార్లమెంట్ స్థానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్‌ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ( శనివారం) ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్‌ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు.

పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.  సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నాగర్‌కర్నూల్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ నుంచి వెంకట్రామిరెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్దప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధన్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య పోటీ చేయ‌నున్నారు.

ఇది కూడా చదవండి:టెట్‌ ఫీజును తగ్గించండి

Latest News

More Articles