Tuesday, May 14, 2024

నేడు బీఆర్ఎస్ కదనభేరీ సభ.!

spot_img

నేడు బీఆర్ఎస్ కదనభేరీ సభకు కరీంగనర్ ముస్తాబుఅవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ లోకసభ ఎన్నికల కదనభేరీ మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ గడ్డ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రెడీ చేస్తోంది. బీఆర్ఎస్ కంచుకోట కరీంనగర్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవనప్పటికీ…2014,18 ఎన్నికల్లో 13 సీట్లకు 12సీట్లను కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్ వేదికగా లోకసభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడు నెల‌లు దాటింది. మేడిగ‌డ్డ‌లో మూడు పిల్ల‌ర్లు కుంగి.. మూడు నెల‌లు గ‌డుస్తున్నా.. ఇంకా ప‌నులు మొద‌లు పెట్ట‌లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గులాబీ జెండా గెలిచి ఉంటే, కేసీఆర్ సీఎం అయి ఉంటే.. మేడిగ‌డ్డలో కుంగిన పిల్ల‌ర్ల దగ్గర ప‌నులు మొద‌లు పెట్టి.. పూర్తి చేసేవారు. మిడ్ మానేరు, ఎల్ఎండీ నింపుకుని పంట పొలాల‌కు నీళ్లు ఇచ్చేవాళ్లం. తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే తెలంగాణ స‌మ‌స్య‌లు అర్థ‌మ‌వుతాయి. ప్ర‌జ‌ల‌కు ఏది అత్య‌వ‌స‌రం అనేది ఆలోచించాలి. పంట పొలాలు ఎడిపోతుంటే రైతులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంత‌మంది రైతులు ఎండిపోతున్న పంట‌కు నిప్పు పెడుతున్నార‌ని తెలిసింది. ఏడుపు వ‌స్తున్న‌ది. ఎందుకు ఈ తెలంగాణ‌కు గోస‌. కేసీఆర్ ఉంటే అడ్డు ప‌డైనా నీళ్లు తీసుకోచ్చేవార‌ని రైతులు అనుకుంటున్నారని వినోద్ కుమార్ అన్నారు.

వంద రోజుల ప‌రిపాల‌న‌లో సాగునీరు ఇవ్వ‌లేక‌పోయింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. రైతుబంధు రైతుకు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఇవ్వాలి. మ‌రి రైతుల‌కు రైతుబంధు పంపిణీలో, నీళ్ల పంప‌కాల్లో ఇబ్బంది పెడుతున్నారు. ఈ విష‌యాల‌పై రేపు(మంగళవారం) కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌స్తావిస్తారు. మ‌ళ్లీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌రాలి.. తెలంగాణ గొంతు వినిపించాలి. రేప‌టి స‌భ‌కు సిరిసిల్ల‌, హుస్నాబాద్, మాన‌కొండూరు, వేముల‌వాడ‌, చొప్ప‌దండి, హుజురాబాద్, క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ నుంచి కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి స‌భ‌ను దిగ్విజ‌యం చేయాల‌ని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : పండగవేళ విషాదం…67 మంది పాలస్తీనియన్లు దుర్మరణం.!

Latest News

More Articles