Saturday, May 4, 2024

అడుగులో అడుగేస్తూ..!

spot_img

గత ఏడాది డిసెంబర్ 8న తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. రోజువారీ ఫిజియోథెరపీతో కేసీఆర్ ఇప్పుడు వాకర్‌ని ఉపయోగించి అడుగులు వేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ర సహాయంతో కేసీఆర్ అడుగులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ప్రజలు స్పందిస్తూ.. త్వరలోనే ఆయన స్వేచ్ఛగా నడవగలగడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ వీడియోపై బీఆర్ఎస్ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సైతం ట్వీట్ చేశారు. “ప్రతి అడుగుతో దృఢ సంకల్పం మరియు నమ్మకం. కర్రతో మార్గనిర్దేశం చేస్తూ బలాన్ని తిరిగి పొందుతున్నారు. సార్ మళ్లీ స్వేచ్ఛగా నడవడానికి మరి కొంత సమయం మాత్రమే మిగిలుంది. ” అంటూ వాకింగ్ స్టిక్ సహాయంతో కేసీఆర్ నడవడానికి ప్రయత్నిస్తున్న వీడియోను బీఆర్ఎస్ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

Latest News

More Articles