Sunday, April 28, 2024

సోనియమ్మ జన్మదినం ముగిసి నలభై రోజులైంది.. నయాపైసా ఇయ్యారా..!

spot_img

‘తెలంగాణ ప్రజలారా మాటిస్తున్నా.. డిసెంబర్ 9న సోనియమ్మ జన్మదినం. అదే రోజు తెలంగాణలో రైతులకి రుణమాఫీ చేస్తాం. మాకే ఓటెయ్యండి’.. ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్, ప్రియంకాలను పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఈ కసాయి మాటలను నమ్మిన రైతులు అత్తెసరు మెజారిటీతో కాంగ్రెస్ కి అధికారం ఇస్తే .. ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్. కట్ చేస్తే.. సోనియమ్మ జన్మదినం ముగిసి దాదాపుగా 40 రోజులు కావొస్తుంది. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదు సరికదా కనీసం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణలో మంత్రులు తమకేం పట్టి అంటూ తిరుగుతున్నారు. గట్టిగా అడిగితే ఇంకా డేట్ ఫిక్స్ కాలే, క్యాబినెట్ లో నిర్ణయించాలనికోమటిరెడ్డి వంటి వ్యక్తులు చెప్తున్నారు. ఇక ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు రైతులు. మీరే కదా ప్రచార సభల్లో మాటిచ్చింది అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇంకొందరైతే తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసమని వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటే.. విదేశాల్లో రేవంత్ రెడ్డి షికార్లు చేస్తున్నారని మండిపడుతున్నారు.

సూటుబూటు వేసుకొని.. దావోస్ వీధుల్లో వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ తిరగటం కాదు.. ఇక్కడ తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయాలనీ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ గోపికి ఫిర్యాదులు చేస్తున్నారు. రైతు బంధు నిధులు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి మోసపోయిన తెలంగాణ రైతులకి కనీసం రుణమాఫీ చేసైనా రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని అభిప్రాయాలూ వస్తున్నాయి. చూద్దాం మరి రైతన్నల గోస కాంగ్రెస్ కి కనపడుతుందో లేదో. లెట్స్ వెయిట్ ఫర్ మోర్ 60 డేస్.. ఆ తరువాత ప్రజల చేతిలో కాంగ్రెస్ కి పాతరే.

Latest News

More Articles