Friday, May 3, 2024

పేటీఎం కీలక నిర్ణయం..పీపీబీఎల్ తో ఒప్పందాలు రద్దు.!

spot_img

నియంత్రణాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం మాత్రుసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు తెలిపింది. అయితే ఆ ఒప్పందాలు ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. పీపీబీఎల్ స్వంతగా తన కార్యకలాపాలు నిర్వహించుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

తమ వినియోగదారులు, వ్యాపారులకు నిరంతరంగా సేవలందించేందుకు ఇతర బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు పేటీఎం ఈమధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా పేటీఎంయాప్, క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డు మెషీన్లు, యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. పీపీబీఎల్ పార్ట్ టైమ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలగిన కొన్ని రోజుల్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. పీపీబీఎల్ ఆయనకు 51శాతం వాటాలు ఉన్నాయి. మిగతావి వన్ 97 కమ్యూనికేషన్స్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.

&

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై 31 జనవరి 2024న చర్య తీసుకుంది. ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు తన సేవలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీని కోసం, 2024 ఫిబ్రవరి 29 తేదీని ముందుగా నిర్ణయించారు. తరువాత దానిని మార్చి 15 వరకు పొడిగించారు.

ఇది కూడా చదవండి:మోదీ సర్కార్ ను టార్గెట్ చేసిన దీదీ..అలా అయితే 2వేలకు ఎల్పీజీ సిలిండర్ అంటూ.!

Latest News

More Articles