Wednesday, May 1, 2024

కొబ్బరినీళ్లు అతిగా తాగితే..ఏమౌతుందో తెలుసా?

spot_img

కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీళ్లు మీ శరీరంలో బలహీనతను నివారిస్తాయి. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అంతే కాదు హైబీపీ,యూటీఐ రోగులకు కూడా కొబ్బరినీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ మోతాదుకు మించి కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి హానికరమనే విషయం మీకు తెలుసా?మోతాదుకు మించి కొబ్బరినీళ్లు తాగితే..అది శరీరంలో పొటాషియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది హైపర్‌కలేమియా సమస్యకు దారితీస్తుంది. మనం ఒక రోజులో ఎంత కొబ్బరి నీళ్లు తాగవచ్చో తెలుసుకుందాం?

WebmD ప్రకారం, కొబ్బరి నీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి అనేదానికి ఎటువంటి సెట్ మార్గదర్శకాలు లేవు. కానీ, ఒక రోజులో 1 కొబ్బరి నీళ్ల కంటే ఎక్కువ తాగకూడదు. అంతే కాకుండా రెగ్యులర్ గా తాగే వారు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు:

-కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

-శరీరంలో అధిక నీరు వాపునకు కారణమవుతుంది.

-కాల్షియం వంటి అవసరమైన మూలకాలు మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లి, లోపం ఉండవచ్చు.

-కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం పెరిగి, బీపీ సమస్య తలెత్తుతుంది.

పొటాషియం అధిక మొత్తంలో తీవ్రమైన పరిస్థితికి కారణమవుతుంది. ఇది తేలికపాటి హైపర్‌కలేమియాకు కారణమవుతుంది.అధిక పొటాషియం కారణంగా గుండె సమస్యలు, కండరాల బలహీనత, పక్షవాతానికి దారితీస్తుంది. కొబ్బరి నీరు కానీ సమతుల్య పరిమాణంలో తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

ఇది కూడా చదవండి: పేటీఎం కీలక నిర్ణయం..పీపీబీఎల్ తో ఒప్పందాలు రద్దు.!

Latest News

More Articles