Sunday, May 19, 2024

కొత్తగూడెంలో భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు..!

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలో సినిమా స్టైల్లో కిడ్నాప్  జరిగింది. భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఇటీవలే ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం నగరానికి చెందిన గొగ్గెల మాధవి ప్రేమవివాహం చేసుకున్నారు.

భార్యను ప్రాజెక్టు వర్కు నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు ఆటోలో  తీసుకెళుతుండగా మార్గమధ్యంలో కారులో ఛేజ్ చేసి యువకుడిపై దాడిచేసారు దుండగులు. యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు దుండగులు. కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడిచేసి తన భార్యను కిడ్నాప్ చేశారని బాధిత యువకుడు ఆరోపించారు. తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.

Latest News

More Articles