Saturday, June 29, 2024

ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్

spot_img

ఐపీఎల్ 2023 సీజన్‌లో మిగితా మ్యాచ్‌లకు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌  దూరం అయ్యాడు. జూన్‌లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో ఆడటం కూడా అనుమానమేనని సమాచారం.

ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో  రాహుల్‌ గాయపడ్డ విషయం తెలిసిందే. స్కానింగ్ లో గాయం సీరియ‌స్‌గా ఉందని, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో.. అత‌నికి రెస్ట్ ఇవ్వాల‌ని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణ‌యించింది. అత‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు ల‌క్నో టీమ్ ట్వీట్ చేసింది.

Latest News

More Articles