Monday, May 20, 2024

టీమిండియా పరువు నిలిపిన కేఎల్ రాహుల్!

spot_img

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు 59 ఓవర్ల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.

సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ (5/44) విజృంభించడంతో భారత్ టాప్‌ ఆర్డర్ విఫలమైంది. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ పరువు నిలబడింది. కేఎల్‌కు తోడుగా సిరాజ్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.

అంతకుముందు విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24), యశస్వి జైస్వాల్ (17) పరుగులు చేయగా.. రోహిత్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమై నిరాశ పరిచారు. వర్షం వల్ల తొలి రోజు ఓవర్లు 31 ఓవర్లు కోల్పోవడంతో మ్యాచ్‌ బుధవారం అరగంట ముందుగానే (మధ్యాహ్నం ఒంటి గంట) ప్రారంభంకానుంది.

Latest News

More Articles