Saturday, May 4, 2024

కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ప్రజలు బాధ పడుతున్నారు

spot_img

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కార్యకర్తలు, బాధపడుతున్నారు అని అన్నారు పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ .రాజకీయంలో గెలవటం ఓడిపోవడం సహజం, ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి..నిరాశ చేందొద్దు అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు కొప్పుల ఈశ్వర్…కేసీఆర్ ప్రభుత్వం లో రైతులకు వచ్చిన నీళ్ళు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నేలల్లో నీళ్ళు మాయ మయ్యాయి. కేసీఆర్ పాలనలో చెరువుల్లో, బావుల్లో, నిండు కుండల్లా ఉండే.కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు ఎందుకు ఎవ్వడం లేదు. రాష్ట్ర రూపు రేఖలు మార్చారు. ఒక నాయకుడు పట్టుదల ఉంటే జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపారు. తెలంగాణ తెచ్చిన పార్టీ కేసీఆర్ పార్టీ, కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవాలి. కేసీఆర్ చరిత్ర తుడిస్తే చెరిగి పోయేది కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 హామీలను నమ్మి మోసపోయి గోస పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆకలి చావులు మొదలయ్యాయి.కేసీఆర్ పరిపాలనలో నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పన జరిగింది. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ప్రజలు మదన పడుతున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చాక ప్రజల అభివృద్ధిపై దృష్టి సాధించక..కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని.. 93 కోట్ల తో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించగా అందులో లక్ష కోట్లు అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్  గోదావరి నది నీళ్లను ఒడిసిపెట్టి రైతులకు అందించిన చరిత్ర కేసీఆర్ ది అని తెలిపారు కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోయి గోస పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన వేతనాలు చెల్లిస్తామని, కాంగ్రెస్ ఎన్నికలలో చెప్పింది, కాని ఏ తేదీన జీతాలు వసున్నయో ఉద్యోగులు గమనిస్తున్నారని తెలిపారు. చాలామంది తట్ట, బట్ట సదురుకుని పార్టీలు మారుతున్నారు. పోయినవాళ్ళు.. పోతారు.. బీఆర్ఎస్ పార్టీ మిగిలిన కార్యకర్తలు, నాయకులు పచ్చి పాల వంటి నికారసైన కార్యకర్తలని చెప్పారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మానవ బాంబు అవుతానని అంటున్నాడు. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడో చెప్పాలన్నారు కొప్పుల ఈశ్వర్. రైతుబంధు అడిగినందుకు సీఎం వారి మంత్రులు చెప్పుతో కొడతాము అంటున్నారు..రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

ఎన్నికలు వస్తున్నాయంటే  వలస పక్షుల్లా కొందరు వస్తుంటారని అన్నారు కొప్పుల. ఎవరు వంశీ, ఎవరు వివేక్, ఎవరు వినోద్  ఇక్కడ నుండి వచ్చారు అని అన్నారు. 50 ఏండ్లుగా రిజర్వేషన్ ఉంది. తండ్రి రిజర్వేషన్ లో ఎంపీ అయ్యాడు. హైదరాబాద్ నుండి వచ్చిన కోటీశ్వరులు వీళ్ళు.. దేశంలోనే అత్యధిక ధనికుల్లో 9వ స్థానంలో వీళ్ల కుటుంబం ఉంటుంది, కుటుంబ పాలన గురించి వీళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తాత ఎంపీ, తండ్రి ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే, వినోద్ ఎమ్మెల్యే, మనవడికి ఎంపీ టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్న వీరిది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నిచారు. ధైర్యం ఉంటే జనరల్ లో పోటీ చేసి గెలవాలి..ఈ విషయంపై ఈ ప్రాంత ప్రజలు  ఆలోచించాలన్నారు.నేను ఈ మట్టిలో పుట్టిన బిడ్డను నా కుటుంబం మొత్తం సింగరేణి కార్మిక కుటుంబం. ప్రజల నుండి వచ్చిన నాయకుడిని. కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు  నాకు లేవు, కోట్ల రూపాయల లేవు..ప్రజల కోసం బతికే మనిషిని..ఇది నా గెలుపు కాదు.. ఇది ప్రజల గెలుపు అని అన్నారు కొప్పుల ఈశ్వర్.

ఇది కూడా చదవండి: పంజాబ్‌లో కల్తీమద్యం: 21కి పెరిగిన మృతులు

Latest News

More Articles