Wednesday, May 22, 2024

14 సీట్లు గెలిచేందుకు క‌ష్ట‌ప‌డుదాం

spot_img

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని ప‌లు స‌ర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా న్యూస్ 24 చానెల్ స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డి అయ్యాయి. ఈ స‌ర్వేలో బీఆర్ఎస్ పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్లు సాధించి, అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించ‌బోతుంద‌ని తేలిన‌ట్లు ఆ న్యూస్ చానెల్ ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బడా భాయ్ మోడీ.. ఛోటా భాయ్ రేవంత్ మ‌ధ్య తెలంగాణ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని న్యూస్ 24 స‌ర్వే వెల్ల‌డించిన‌ట్లు కేటీఆర్ త‌న ట్వీట్‌లో ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. న్యూస్ 24 చానెల్ స‌ర్వే ప్ర‌కారం బీఆర్ఎస్‌కు 8 సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. అయితే ఈ 8 సీట్ల నుంచి 13, 14 గెలిచేందుకు క‌ష్ట‌ప‌డుదాం అని పార్టీ కేడ‌ర్‌కు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విజ్ఞ‌ప్తి చేశారు.

ఇది కూడా చదవండి: రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ

న్యూస్ 24 చానెల్ స‌ర్వే ప్ర‌కారం.. బీఆర్ఎస్‌కు 8, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి 6, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంద‌ని న్యూస్ 24 చానెల్ చెప్పింది. అదే జ‌రిగింది.

Latest News

More Articles