Sunday, May 12, 2024

దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చెయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్..!

spot_img

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలంటూ రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని అనంతరం ప్రసంగించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ..కేసీఆర్ శకం ముగిసిందంటూ రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారని..దమ్ముంటే ఒక సీటు గెలిచి చూపెట్టు అంటూ రేవంత్ సవాల్ విసిరారని కేటీఆర్ అన్నారు. రేవంత్ నువ్వు గొప్పోడివి కాదా..ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు..మల్కాజ్ గిరి సీటులో పోటీ చేద్దాం తేల్చుకుందాం రా అన్నాను. కానీ రేవంత్ నుంచి ఎలాంటి స్పందన లేదని మళ్లీ నోరేత్తలేని విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

ఐదేండ్లలో మల్కాజ్ గిరిలో రేవంత్ ఒక్క పని కూడా చేయలేదు. ఎవర్నీ పలకరించిన పాపాన పోలేదు. కాబట్టి ఆవేశానికి పోతే ఓడిపోతానన్న భయంలో రేవంత్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ మల్కాజ్ గిరిలో నిలబడేందుకు వణుకుతున్నారన్నారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని…రేవంత్ కు ధైర్యం ఉంటే రాజీనామా చేసి వచ్చి పోటీ చేద్దామా అంటూ సవాల్ విసిరారు. డైలాగులు చెప్పడానికి మాత్రమే…ఆచరణలో పెట్టడానికి మాత్రం చూపించడు అంటే ఫైర్ అయ్యారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం.!

Latest News

More Articles