Sunday, April 28, 2024

లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం.!

spot_img

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చికుర్ బత్తి, పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ రేంజీ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనాస్థలం నుంచి మావోయిస్టుల మ్రుతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల వేళ ఈ భారీ ఎన్ కౌంటర్ జరగడంతో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు యాంటీ నక్సల్ ఆపరేషన్ను చేపట్టారు.

ఇది  కూడా చదవండి: ఆఫీస్ వర్క్ తో పాటు ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి?

Latest News

More Articles