Monday, May 20, 2024

42వేల ఉద్యోగ‌ క‌ల్పన‌.. ఓఆర్‌ఆర్‌ పై కేటీఆర్ ఫ్లెక్సీలు

spot_img

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ ప‌ర్యట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా దాదాపు 15 రోజుల పాటు అమెరికా, లండ‌న్ దేశాల్లో కేటీఆర్ ప‌ర్యటించారు. సుమారు 42 వేల ఉద్యోగ‌, ఉపాధి క‌ల్పన‌తో రాష్ట్రానికి తిరిగి వ‌స్తున్న కేటీఆర్‌కు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగ‌తం ప‌లికేందుకు సిద్ధమ‌య్యారు.

‘వెల్‌కమ్‌ టు అవర్‌ డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌ ’అంటూ ఓఆర్‌ఆర్‌ తో పాటు పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ యువజన నాయకులు భారీ హోర్డింగ్స్ ఫ్లెక్సీ లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ యువతకు 42 వేల ఉద్యోగ అవకాశాలతో వస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన‌డం జ‌రిగింది.

Latest News

More Articles