Friday, May 3, 2024

నెటిజెన్స్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. రంబుల్ స్ట్రిప్స్ తొలగింపు

spot_img

హైదరాబాద్: వాహనదారుల వేగాన్ని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రంబుల్ స్ట్రిప్ ను ఏర్పాటు చేశారు.అయితే,  దీనివలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెన్నుపూస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని నెటిజెన్స్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ రంబుల్ స్ట్రిప్ లో మార్పులు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, ఇంజనీరింగ్ చీఫ్ కి సూచనలు చేశారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు తొలగించారు. తమ సమస్యపై స్పందించి సానుకూలంగా ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest News

More Articles