Saturday, May 18, 2024

తెలంగాణకి ఎలైట్ బార్లు అవసరమా.. నిలదీసిన కేటీఆర్

spot_img

పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అని అన్నారు కేటీఆర్. తాజాగా మీడియాతో కేటీఆర్ తెలంగాణ భవన్ లో చిట్ చాట్ చేశారు. ‘రాష్ట్రాన్ని బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎలైట్ బార్లు పెడతామంటుంది. కాలేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదంటూనే.. కొండ సురేఖ నిన్న లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెబుతుంది. పంటకు 500 బోనస్ మద్దతు ధర ఇస్తారా ఇవ్వరో చెప్పాలి. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే జీవోలు ఇవ్వండి. వందరోజుల హమీలపైన అమలు ఇచ్చిన వాటిపైన జీవోలు ముందే ఇవ్వండి. 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీల అమలుపైన వెంటనే జీవోలు ఇవ్వాలి.

రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది 2500 ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. హామీల అమలుపైన చేతులెత్తేస్తే ప్రజలు నిలదీస్తారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కొట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నా. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నది. ఎల్లుండి పార్టీ మైనార్టీ విభాగం సమావేశం ఉంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ ఎన్నికల సమావేశాలు ఉంటాయి. ప్రస్తుతం సర్పంచుల పాలన కాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలు మౌలిక వస్తువులను వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇన్చార్జిల పేరిట గ్రామాలలో నడిపించే కంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టాలి. బండి సంజయ్ కరీంనగర్ కు చేసిన పనులెంటో వివరించాలి. బండి సంజయ్ చెప్పిన అంశాల పైన మా సీనియర్ నాయకులు వినోద్ గారితో కరీంనగర్లో ఎక్కడ చర్చకు వస్తారో చెప్పాలి’ అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles