Friday, May 17, 2024

గవర్నర్ కాంగ్రెస్ లో చేరిపోవాలి..!

spot_img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తప్పుబట్టారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్.. కీలక నిర్ణయాల విషయంలో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ వంటి ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేసిన వారిని తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడేమో కాంగ్రెస్ అభ్యర్థులని ఎలా ఎంపిక చేస్తారు.. వీరిద్దరి రాజకీయ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది.

ఇక కోదండరామ్ నామినేషన్‌పై గవర్నర్ చాల వేగంగా స్పందించారు. అయితే శ్రవణ్, సత్యనారాయణలపై ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ ప్రజా నిధులతో నడుస్తోందని, గవర్నర్‌ తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల రహస్య పొత్తుకి ఆశ్చర్యపోయానన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత గవర్నర్ కాంగ్రెస్ కి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రెండు పార్టీల మధ్య ఐక్యత కోసం ఇటీవల బీజేపీ నేత బండి సంజయ్ కూడా పిలుపుని ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ఇక గవర్నర్ బీజేపీ కార్యకర్త అని తాను ఇంత కాలం అనుకున్నానని అన్నారు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోందని చెప్పారు. అయితే అధికారికంగానే ఆ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీపై అభిమానాన్ని చాటుకోవాలని ఎద్దేవా చేశారు.

Latest News

More Articles