Monday, May 20, 2024

రేపు మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: మంత్రి కేటీఆర్ రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ టవర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం పది వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అమరరాజ గిగా ఫ్యాక్టరీ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారు. బాయ్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.

ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజాల కల సాకారం అవుతుందన్నారు. గత పాలకులు వలసల జిల్లాగా మార్చారని, కానీ నేడు ఇక్కడే సాఫ్ట్ వేర్ కొలువులు రానున్నాయని పేర్కొన్నారు. రేపు ఐటీ టవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎనిమిది కంపెనీలతో ఎంవోయూ కార్యక్రమం ఉంటుందన్నారు.

గతంలో ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. నేడు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పుతున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ గ్రీన్ ఎనర్జీ పార్క్ కు శంకుస్థాపన చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Latest News

More Articles