Sunday, May 19, 2024

గూగుల్‌ మ్యాప్‌ చూస్తూ ప్రాజెక్ట్‎లోకి దూసుకెళ్లిన లారీ

spot_img

మనలో చాలామంది ఏదైనా అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూస్తూ మనకు కావలసిన డెస్టినేషన్‎కు చేరుకుంటాం. అయితే ఒక్కోసారి గూగుల్ కూడా తప్పుడు అడ్రస్ చూపిస్తుంది. అలా తప్పుడు రూట్ చూపించడంతో ఓ లారీ ఏకంగా ప్రాజెక్ట్‎లోకే వెళ్లిపోయింది. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలో లారీ చిక్కుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది.

Read also: రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం..!!

తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌ వస్తోంది. డ్రైవర్‌ శివ, క్లీనర్‌ మొండయ్యకు దారిపై సరైన అవగాహన లేదు. దాంతో ఫోన్‌లో గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ ఆధారంగా వస్తున్నారు. నందారం స్టేజీ దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్‌ చూపింది. చీకటి కావడంతో వారు కూడా మ్యాప్ ఆధారంగా అలాగే ముందుకు వెళ్లారు. కొంచెం ముందుకు వెళ్లగానే రోడ్డు మీద నీరు ఉంది. అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదంతా వాన నీరు అనుకున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లగానే లోతు పెరిగి.. లారీ క్యాబిన్‌ వరకు నీళ్లు వచ్చాయి. దాంతో లారీ ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే వారిద్దరూ లారీ నుంచి కిందకు దిగి మెల్లగా బయటకు వచ్చి సమీపంలోని రామవరం గ్రామానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలపగా అది వాన నీరు కాదు.. గౌరవెల్లి ప్రాజెక్ట్ అని చెప్పారు. దాంతో లారీ డ్రైవర్, క్లీనర్ తృటిలో తప్పించుకున్నామనుకున్నారు. గ్రామస్తుల సహకారంతో లారీకి తాళ్లు కట్టి వెనక్కు లాగడంతో అతికష్టం మీద బయటకు వచ్చింది.

Latest News

More Articles