Tuesday, May 7, 2024

గ్రీన్‌ కార్డు కోసం 10.5 లక్షల మంది వెయిటింగ్.. కొత్త వారికి ఎన్నేండ్లు పడుతుందో తెలుసా?

spot_img

న్యూఢిల్లీ: ఇండియాలో అమెరికాలో పౌరసత్వానికి ఫుల్ డిమాండ్ ఉంది. క్యాటో సంస్థకు చెందిన డేవిడ్‌ జే బయర్‌ జరిపిన అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. 10.5 లక్షల మంది(63శాతం)కిపైగా ప్రవాస భారతీయ ఉద్యోగులు గ్రీన్‌ కార్డు కోసం వెయిటింగ్ లీస్టులో ఉన్నారు. ఇక చైనా నుంచి 2.5 లక్షల మంది(17శాతం) క్యూలో ఉన్నారని నివేదిక తెలిపింది.

Read Also.. బీ అలెర్ట్.. 79 శాతం పెరిగిన క్యాన్సర్‌ కేసులు.. వీటికి దూరంగా ఉండండి..!

అమెరికాలో శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు ఇచ్చే ఈ గ్రీన్‌ కార్డుపై పరిమితి ఉంటుంది. ఒక్కో దేశానికి 7 శాతానికి మించి ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికే క్యూలో ఉన్నవారికి వచ్చేందుకు ఏళ్లకు ఏండ్లు పడుతుంది. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి జీవిత కాలం కంటే ఎక్కువ సమయమే పట్టే పరిస్థితి కనిపిస్తోంది.

Read Also.. కొత్త పార్లమెంట్‌లో సమావేశాలకు ముహుర్తం ఖరారు..!

ఇదిలా ఉండగా.. గ్రీన్‌ కార్డుల దరఖాస్తుల్లో 50శాతం ఈబీ-2కు చెందినవే కావడం గమనార్హం. అమెరికా వ్యాపారాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ అత్యున్నత డిగ్రీలు కలిగిన వారిని ఈ కేటగిరీ కింద అనుమతిస్తారు. అలాగే డిగ్రీ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిని ఇచ్చే ఈబీ-3 కేటగిరీ కింద 19శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. బీ-2, ఈబీ-3 కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయులు 134 సంవత్సరాలు వేచి ఉండాల్సిందే. ఈ కేటగిరీ దరఖాస్తుల్లో  90శాతం మంది భారతీయులవేనని తాజా నివేదికలో వెల్లడించారు.

Latest News

More Articles