Sunday, May 19, 2024

బీఆర్ఎస్‎లో చేరిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు

spot_img

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ బీఆర్ఎస్‎లో చేరికలు ఎక్కువ అవుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు గలాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనెల గాయత్రి భవాని బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనెల గాయత్రి భవాని, గోనెల రాజేశ్వరి, గోనెల లావణ్య, గోనెల లక్ష్మి, యాదమ్మ, సరస్వతి, మంగమ్మ మరియు నరేష్, రమణ, శ్యామ్, నిరంజన్, రాము, రాజేష్, సాయికిరణ్ సహ సుమారు 50 మందికి పైగా బీజేపీ నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Read Also: ఎన్నికల కోసం కేసీఆర్ ప్రచార రథం సిద్ధం

రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎన్నికలు సమీపిస్తున్నాయని లేనిపోని హామీలు ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు… వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రూ. 200 పెన్షన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2016, రూ.4016కు పెంచామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అంగన్వాడి ద్వారా గుడ్లు, పౌష్టికాహారం ఇస్తున్నామని, కుల సంఘాలకు భవనాలు ఇచ్చామని, లక్షలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నామన్నారు. ఐటి పార్కు, లిథియం గిగా పరిశ్రమ, ఫుడ్ పార్క్‎తో ఇక్కడి యువతకు ఇక్కడే వేలాది ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జిల్లాలోని అన్ని చెరువులను నింపి సంవత్సరంలో రెండు పంటలు పండించేలా చర్యలు చేపడతామన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే పార్టీల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

బీఆర్ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరాం… గోనెల గాయత్రి భవాని
బీజేపీలో ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఉన్నా ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదు. బీజేపి కనీసం సింగిల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలను కూడా కైవసం చేసుకోలేదు. అక్కడ ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించే బీజేపీ నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తాం.

Read Also: కేసీఆర్‎కు సాటి ఎవ్వరు? పోటీ ఎవ్వరు? సరితూగే నేత ఎవ్వరు?

Latest News

More Articles