Tuesday, May 7, 2024

ఎన్నికల కోసం కేసీఆర్ ప్రచార రథం సిద్ధం.. ఎవరు గిఫ్ట్‎గా ఇచ్చారో తెలుసా?

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రం మొత్తం రాజకీయంగా హీటెక్కింది. ఆయా పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌.. నేడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు హుస్నాబాద్‎లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. కాగా.. కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేశారు. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ఈ బస్సు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‎కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. దాంతో కొన్ని రోజుల క్రితమే ఈ బస్సు ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరింది. ఈ బస్సు నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై పరుగులు పెట్టనుంది. అందులో భాగంగా ఈ రోజు హుస్నాబాదుకు ప్రచార రథం చేరుకోనుంది.

Read Also: కేసీఆర్‎కు సాటి ఎవ్వరు? పోటీ ఎవ్వరు? సరితూగే నేత ఎవ్వరు?

2014 జూన్‌ 2న తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌.. నేటికి అంటే 15-10-2023 నాటికి ఏకబిగిన 9 ఏండ్ల 134 రోజులుగా సీఎంగా కొనసాగుతున్నారు. అవాంతరాలు లేకుండా ఇంత సుదీర్ఘంగా సీఎంగా కొనసాగిన తెలుగు నేత మరెవరూ లేరు. కేసీఆర్‌ మరో రికార్డుకు కూడా చేరువలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ద్వారా దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు సీఎం అయిన వ్యక్తిగా నిలిచేందుకు కొద్దిదూరంలోనే ఉన్నారు. సమకాలీన భారతదేశ రాజకీయ రంగంలో కేసీఆర్‌కు ఉన్న ఘనతలు మరెవరికీ లేవు. స్వయంగా ఒక ఉద్యమ పార్టీని స్థాపించి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సాధించుకున్న రాష్ట్రానికి తొమ్మిదిన్నరేండ్లుగా ముఖ్యమంత్రిగా, 22 ఏండ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీకి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఏడాది కిందట బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా అవతరించింది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ అధినేతగా, సీఎంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ ఇప్పుడు ఒక కీలక నాయకుడు.

Read Also: పాక్ మ్యాచ్‎లో రోహిత్ మూడు రికార్డులు

Latest News

More Articles