Sunday, May 19, 2024

Viral : వీడి క్రియేటివిటీ తగలెయ్య.. పంచ్‎ను కాస్త సర్పంచ్ చేశాడు.. పోలీసుల రియాక్షన్ చూస్తే..?

spot_img

చాలా మంది తమ వాహనాల నెంబర్ ప్లేట్లను తమకు నచ్చిట్లుగా రకరకాల ఫాంట్స్, ఫొటోలు, స్టయిల్స్ తో తయారు చేయించుకుంటుంటారు. ఇది మోటార్ వాహన చట్టం ప్రకారం నేరం. ఇలాంటివి సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉంటుంటాం. ఈమధ్య కాలంలో వాహనాలపై కులానికి సంబంధించి స్టిక్ర్లు ఉంటే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇలాంటి స్టిక్కర్లం సంఖ్య తగ్గింది. ఇదిలా ఉంటే గ్రేటర్ నోయిడాలోని ఓ వ్యక్తి తన కారుకు ఇలాంటి క్రియేటివిటీని ప్రదర్శించాడు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: కేసీఆర్‎కు సాటి ఎవ్వరు? పోటీ ఎవ్వరు? సరితూగే నేత ఎవ్వరు?

అసలు విషయం ఏంటంటే…ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన ఒక వ్యక్తి టాటా పంచ్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారుపై తన క్రియేటివిటీని చూపించాడు. అందులో టాటా కారు పేరునే మార్చేశాడు. పంచ్ పేరుకు ముందు సర్ అని దాని పక్కన జీ అని మార్చాడు. అంటే ఆ కారు పేరు సర్పంచ్ జీగా మార్చేశాడు. గ్రేటర్ నోయిడాలో రోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ కారును చూసిన కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది కాస్త పోలీసుల వరకు వెళ్లింది. వైరల్ ఫోటోను చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్యక్తికి రూ. 500జరిమానా విధించారు.

Latest News

More Articles