Saturday, May 18, 2024

రోడ్డు ప్రమాదంలో మలయాళ సినీ నటుడు మృతి

spot_img

కేరళలోని కైపమంగళం దగ్గర ఇవాళ(సోమవారం) ఉదయం 4.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి (39) మృతి చెందారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు.. మిమిక్రీ ఆర్టిస్ట్ బిను అడిమాలు, ఉల్లాస్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో సుధి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కొడుంగల్లూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ముగ్గురికీ చికిత్స కొనసాగుతోంది.

సుధి మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. సుధి 2015లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ అయిన సుధి.. కొట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనదన్ మరప్పప్ప సహా పలు సినిమాల్లో నటించాడు. సుధి మృతిచెందారని తెలియడంతో మలయాళ చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం తెలిపారు.

Latest News

More Articles