Saturday, May 4, 2024

సీఎం కేసీఆర్ పాలనా దక్షత.. దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ

spot_img

హైదరాబాద్: 9 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, పాలనా దక్షత గురించి అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయని, పదో సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో అనేక రంగాల్లో దేశానికి ఒక దిక్సూచి గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

గ్లోబల్ సిటీగా హైదరాబాద్

‘‘పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రము అగ్ర భాగంలో ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ తెలిపింది. రాష్ట్ర ప్రజలుగా ఇది మనందరికీ గర్వకారణం. గత పది సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నిరంగాల్లో, అన్ని అంశాల్లో తనదైన ముద్ర వేయగలిగారు.  హైదరాబాద్ నగరం ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్ధి చెందినది. కానీ గ్లోబల్ సిటీగా మారాలంటే అనే అంశాల్లో మరింత పని చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది.

ప్రజలు బాధ్యతారాహిత్యం వీడాలి

పురపాలనతో పాటు అనేక అంశాలలో మాతో పనిచేస్తున్న asci సంస్థ కు ధన్యవాదాలు.  ఇల్లు మాత్రమే నాది… నగరం నాది కాదు అనే బాధ్యతారాహిత్యం ప్రజల్లో ఉన్నన్ని రోజులు… ఎన్ని నిధులు ఖర్చుపెట్టిన నగరం సంపూర్ణంగా మారదు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం లేకపోతే మార్పు సాధ్యం కాదు. నగరంలో రోడ్లతో పాటు అనేక అంశాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది.

ప్రతి శనివారం రీతింగ్ డే

రెడ్యూస్, రీసైకిల్, రియూస్ అనే ట్రిపుల్ అర్ మంత్ర ఉంది. దీన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకు వచ్చినప్పుడే పట్టణాలు మార్పు సాధ్యమవుతుంది.  ప్రతి శనివారాన్ని రీతింగ్ రోజుగా పాటిద్దాం.  రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలు నాటి వాటిని కాపాడుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికి ఒక నర్సరీ పెట్టి, చెట్ల పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు

పట్టణ మరియు పంచాయతీరాజ్ చట్టంలో గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ. ప్రజల అవసరాల మేరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయలు అందుబాటులోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధించడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రై రిసోర్సెస్ సెంటర్ల ద్వారా మహిళ సంఘాలు పలుచోట్ల గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఈ సెంటర్ల ద్వారా ఆరు కోట్ల కు పైగా ఆదాయాన్ని స్వయం సహాయక సంఘాలు అర్జించాయి.

వేస్ట్ ద్వారా 200 కోట్లకు పైగా ఆదాయం

హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే వెట్ వేస్ట్ ద్వారా సుమారు 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. వ్యక్తులు కూడా సామాజిక బాధ్యతను గుర్తించి రెడ్యూస్, రీసైకిల్, రియూస్ మంత్ర పాటించాలి. నగరం పెరుగుతున్న కొద్ది చెత్త సేకరణతో పాటు దాన్ని రీసైకిల్ చేసే వ్యవస్థలు మరింత పెరగాల్సిన అవసరం ఉన్నది. జనరేట్ చేసిన 2014తో పోల్చితే హైదరాబాదు నగరంలో చెత్త సేకరణ, రీసైకిల్ అనేక రెట్లు పెరిగింది.

178 కోట్ల రూపాయలతో  బయో మైనింగ్

హైదరాబాద్ నగరంలో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ రీసైకిల్ ప్లాంట్లను మరో రెండింటిని హైదరాబాద్ నగరంలో పెట్టబోతున్నాం. హైదరాబాద్ నగరం తో పాటు పలు పురపాలికల్లో చెత్త నుంచి గ్యాస్ని సేకరించి వంటకి, వాహనాలకు ఉపయోగించే కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నాం.  141 పురపాలికల్లో 178 కోట్ల రూపాయలతో  బయో మైనింగ్ ప్రారంభించాం.

100% వేస్ట్ వాటర్ రీసైకిల్

మానవ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఈ రాష్ట్రంలో జరగడం లేదు.  భారతదేశంలోని 100% వేస్ట్ వాటర్ ని రీసైకిల్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ త్వరలో మారబోతున్నది.  సోలార్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం.’’ అని కేటీఆర్ వివరించారు.

Latest News

More Articles