Wednesday, June 26, 2024

ఓటు వేసి తిరిగివెళుతూ.. గుండెపోటుతో వ్యక్తి మృతి!

spot_img

సిద్దిపేట : సిద్దిపేటలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓటు వేసి తిరిగివెళుతూ గుండెపోటుతో మృతి చెందాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్య‌క్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసారు. అనంతరం ఇంటికి తిరిగి వెళుతుండ‌గా గుండెపోటుకు గుర‌య్యాడు. స్దానికులు స్వామిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని డాక్టర్లు చెప్పారు.

Latest News

More Articles