Sunday, June 16, 2024

శత్రువకు వణుకే.. భారత వైమానిక దళం బలోపేతం

spot_img

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. భారీ సంఖ్యంలో ఫైటర్ జెట్స్ కొనుగోలుకు డిఫెన్స్ ప్యానెల్‌ ఓకే చెప్పింది. 97 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు 156 ప్రచండ్‌ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా అనుమతించారు. వీటిలో 90 హెలికాప్టర్లు ఆర్మీకి, 66 హెలికాప్టర్లు ఐఏఎఫ్‌కు కేటాయించనున్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన ఎస్‌యూ-30 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌కు కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తేజస్ విమానాలు, ప్రచండ్‌ హెలికాప్టర్ల డీల్‌ విలువ రూ.1.1 లక్షల కోట్లు అని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

Latest News

More Articles