Saturday, May 18, 2024

ప్రిగోజిన్‌ మరణంపై పలు అనుమానాలు..!

spot_img

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై తిరుగుబాటు చేసి వార్తల్లో నిలిచిన ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌(62) మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ప్రయాణించిన ఎంబ్రేర్‌ లీగసీ 600 ఎగ్జిక్యూటివ్‌ జెట్ విమానంలో ప్రమాదానికి 30 సెకన్ల ముందు వరకు ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ విమానంలో చివరి క్షణాల్లో సమస్య తలెత్తి కుప్పకూలినట్లు సమాచారం.

ఫ్లైడ్‌రాడార్‌ 24 ప్రకారం.. బుధవారం సాయంత్రం 6.11 గంటల సమయంలో ఎంబ్రేర్‌ లీగసీ 600 విమానం కేవలం 30 సెకన్లలోనే విమానం 28వేల అడుగుల ఎత్తు నుంచి 8వేల అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత కొద్ది సెకన్లకే విమానం కుప్పకూలింది.

మరోవైపు ఈ విమానం ప్రమాదంలో ప్రిగోజిన్‌తో సహా మొత్తం 10 మంది దుర్మరణం చెందినట్లు రష్యా ఫెడరల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రైవేటు జెట్‌ విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Latest News

More Articles