Tuesday, May 21, 2024

అది ఫేక్ వీడియో. మాస్టర్‌ బ్లాస్టర్‌ సీరియస్!

spot_img

ముంబై: ఇటీవల కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇండియన్ లెజెండ్ క్రికేటర్ సచిన్‌ టెండూల్కర్‌ కూడా ‘డీప్‌ ఫేక్‌’ బాధితుల జాబితాలో చేరాడు. ఇటీవల సినీ స్టార్స్ రష్మిక మందన్నా, కత్రినా కైఫ్‌తో పాటు పలువురు డీప్‌ ఫేక్‌ వీడియోల బారిన పడ్డ విషయం తెలిసిందే.

Also Read.. అశ్విన్‌పై యువరాజ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో సచిన్ ఓ గేమింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్టుగా దానిని సృష్టించారు. అయితే దీనిపై సచిన్‌ స్పందించారు. ఇది నకిలీదని, ఇలాంటివి తమ దృష్టికి వస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సచిన్‌ అభిమానులను కోరాడు. టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తున్నదని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest News

More Articles