Saturday, May 11, 2024

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు.. ఐఎంఎఫ్ చీఫ్‌ క్రిస్టలినా

spot_img

వాషింగ్టన్‌: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఐఎంఎఫ్  మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియేవా అన్నారు. అదేసమయంలో ఉత్పాదకతను గణనీయంగా ఈ టెక్నాలజీ పెంచుతుందని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వెళ్లడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో క్రిస్టలినా ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read.. శంషాబాద్ శివారులో చిరుత పులి. భయాందోళనలో స్థానికులు!

ముఖ్యంగా అభివృద్ధి దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం 40 శాతానికి పరిమితమవుతుందని పేర్కొన్నారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాల రంగాలపై ఈ టెక్నాలజీ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఏఐతో వచ్చే అవకాశాలను పొందేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Latest News

More Articles