Monday, May 20, 2024

అశ్విన్‌పై యువరాజ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు

spot_img

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రవిచంద్రన్‌ అశ్విన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌ గొప్ప బౌలరే అయినప్పటికీ అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు.

Also Read.. బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

అశ్విన్‌ గొప్ప బౌలర్‌. అందులో డౌటే లేదు. అయితే, వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా అతడు ఏం ప్రభావం చూపగలడు? అని ప్రశ్నించారు. టెస్టుల్లో మాత్రం అతడు ఉండాల్సిందేనని చెప్పాడు.

Also Read.. స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు..తండ్రీకొడుకులు దుర్మరణం..తల్లి పరిస్థితి విషమం

అశ్విన్‌, యువరాజ్‌ చాలాకాలంపాటు కలిసి ఆడారు. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులోనూ వీరిద్దరు ఉన్నారు. అశ్విన్‌ చాలా కాలంపాటు మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. భారత్‌ తరఫున 95 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు.

Latest News

More Articles