Saturday, May 4, 2024

బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

spot_img

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కేటీఆర్. మల్లేష్ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు. కేటీఆర్ వెంట మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Also Read.. పండగపూట రైతులకు షాకిచ్చిన ఇరిగేషన్ మంత్రి

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లేష్ కుటుంబానికి పార్టీ నుంచి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. పార్టీ తరఫున మల్లేష్ కుటుంబం కోసం న్యాయపోరాటం చేస్తాం. మల్లేష్ భార్యకు ఉపాధి కోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తాం. మల్లేష్ పిల్లలను చదువులపరంగా అన్ని విధాలా ఆదుకుంటాం. మల్లేష్ కుటుంబాన్ని నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఆదుకోవాలి. మీడియా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మల్లేష్ ను దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ దుండగులను చట్టపరంగా శిక్షించాలి. మల్లేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేయడం దుర్మార్గమైన చర్య. మల్లేష్ బిఆర్ఎస్ కార్యకర్తనే కాదు దేశ సైనికుడు అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles