Thursday, May 2, 2024

పండగపూట రైతులకు షాకిచ్చిన ఇరిగేషన్ మంత్రి

spot_img

కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు ఉన్నదని, అయితే ఈ ఏడాది బరాజ్‌లలో నీటినిల్వలు లేకపోవటంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్థిరీకరణ ఆయకట్టులో ఈ యాసంగి సగానికిపైగా తగ్గే అవకాశమున్నదని చెప్పారు. నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.

Read Also: ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్

కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎస్సారెస్పీ స్టేజ్‌-2తో కలిపి మొత్తంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది అందుబాటులో లేకుండాపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటి నిల్వలు అడుగంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వలేకపోతున్నామని పేర్కొన్నారు. రైతులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

ప్రస్తుతం కృష్ణాబేసిన్‌లో తీవ్ర నీటి కొరత ఉన్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు కోయినా నుంచి నీరివ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. నీటికి బదులుగా ఆ మేరకు కరెంటిస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. కొయినా నుంచి మొత్తంగా 100 టీఎంసీల నీటిని అడగాలని భావిస్తున్నట్టు చెప్పారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి ఆల్మట్టి నుంచి 10 టీఎంసీల నీటిని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా కోరనున్నామని వెల్లడించారు. కృష్ణా నీటిని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనున్నదని వివరించారు.

Latest News

More Articles