Sunday, May 19, 2024

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన మెదక్ యువతి

spot_img

మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఆమెకు 4 కొలవులు దక్కాయి. పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన బంజా రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ,ఒక కుమారుడు ఉన్నారు. రాజప్ప తనకు ఉన్న కొద్దిపాటి పొలంతో కొడుకు అరవింద్, కూతుళ్లు సౌభాగ్య, సౌమ్య లను ప్రైవేటు బడిలో చదివించలేకపోయాడు. తన ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి, చేసేది లేక వారందరిని ప్రభుత్వ బడిలో చదివించాడు. కాగా రాజప్ప కుమారుడు అరవింద్ ఇటీవల నిర్వహించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగం సాధించాడు. పెద్ద కూతురు సౌజన్యను డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. ఇక చిన్న కూతురైన సౌమ్య ఒకటి నుండి ఏడవ తరగతి వరకు సొంత గ్రామమైన అన్నారo ప్రభుత్వ బడిలో చదివించాడు , 8 నుండి 10వ తరగతి వరకు పక్క గ్రామమైన కొత్తపల్లిలో జిల్లా పరిషద్ హై స్కూల్ చదివింది, ఇంటర్మీడియట్ మెదక్ లోని గీతా జూనియర్ కళాశాలలో చదివి, డిగ్రీ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తిచేసింది. చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండే సౌమ్య,  ఆ తర్వాత ఎమ్మెస్సీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసింది. ప్రస్తుతం, పీహెచ్డీ మొదటి సంవత్సరం చదువుతుంది.

ఇటీవల నిర్వహించిన గ్రూప్ -4 జాబ్ సంపాదించినా సౌమ్య, గురుకుల సంక్షేమ కాలేజీల నియామాకాల్లో టిజిటి, పిజిటి ,జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికయింది. దీనితో తాను… నెల వ్యవధిలోనే నాలుగు జాబ్ లు ఎంపికయినట్టయింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన సౌమ్య నాలుగు జాబ్ లకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తాను జూనియర్ లెక్చరర్ జాబ్ లో జాయిన్ అవుతానని తెలిపారు సౌమ్య. రానున్న రోజుల్లో పీహెచ్డీ పూర్తి చేసి, ప్రొఫెసర్ గా పనిచేయాలని తన లక్షమని ఆమె తెలిపారు.సౌమ్య చిన్నప్పటి నుండి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని బలమైన కొరికే ఉండేదని సౌమ్య తండ్రి, రాజప్ప తెలిపాడు.

ఇది కూడా చదవండి:ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతి

Latest News

More Articles