Friday, May 17, 2024

మెగా కోడలు షాకింగ్ డిసిషన్..!!

spot_img

Lavanya Tripathi  :  వరుణ్‌తేజ్‌, లావణ్యాత్రిపాఠిల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా కోడలుగా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల ఆమె సినిమాలు కూడా తగ్గించుకున్నారు. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా మినహా ఆమె చేతిలో సినిమాల్లేవు.

Also Read.. భారీ వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి బ్రో…!!

అయితే కొన్ని నెలల క్రితం కథ నచ్చటంతో ఆమె ఓ వెబ్‌ సిరీస్‌కి ఓకే చెప్పారు. ‘స్కైలాబ్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్‌ ఖండేరావ్‌ దర్శకుడు దీనిని తీస్తున్నాడు. కథ రీత్యా ఇందులో హీరోయిన పాత్ర కాస్తంత బోల్డ్‌గా.. ఇంటిమేట్‌ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్‌సిరీస్‌ చేయటం కుదరదని.. దర్శక, నిర్మాతలను పిలిపించి చెప్పిందట. మెగా కోడలిగా ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన వారంతా లావణ్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Latest News

More Articles